- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాలు మావే.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. ఇవాళ ఆయన ఖమ్మం (Khammam)లో మీడియాతో మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందని తెలిపారు. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని రీతిలో మెజారిటీ స్థానాలు రావడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేని కారణంగానే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ (Ordinance) తీసుకొచ్చామని.. కానీ, ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించే వాళ్లది అవివేకమని, మూర్ఖత్వమని ప్రభుత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ (BRS) నాయకును ఉద్దేశించి కామెంట్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ (BJP)లు ఓకే తాను ముక్కలని.. ఒకరు రాసిన స్ర్కిప్ట్ మరొకరు చదువుతారని సెటైర్లు వేశారు. ఎన్ని స్టంట్స్ చేసినా.. వారిని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. తమ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పిన విధంగా దేశానికే ఆదర్శంగా కులగణన ప్రక్రియను శాస్త్రీయంగా చేపట్టామని.. ఎన్నికల్లో చెప్పిన విధంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.






