రైతులకు లక్ష కోట్లు ఖర్చు చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

by Muthe.Rajitha |   (  Updated:2025-06-24 13:11:21  IST  )

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా(Riathu Bharosa) పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు.

రైతులకు లక్ష కోట్లు ఖర్చు చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అమలు చేస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా(Riathu Bharosa) పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. నేడు హైదరాబాద్ లో జరిగిన 'రైతు నేస్తం'(Raithu Nestam) సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతు పథకాలను పొరుగు రాష్ట్రాలు అనుసరించాలని చూస్తున్నాయని అన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీని, 25 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్లు జమ చేశామని వెల్లడించారు. ఇలాంటి ఘనత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని అన్నారు.

రైతు భరోసా పథకం కింద 67.01 లక్షల మంది రైతులకు రూ.8284.66 కోట్లు తొమ్మిది రోజుల్లోనే జమ చేసి రికార్డు సృష్టించామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయ రంగానికి రూ.1.04 లక్ష కోట్లు ఖర్చు చేశామని తెలియజేశారు. రబీ సీజన్లో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్ల రికార్డు ఉత్పత్తితో దేశంలోనే ముందున్నామని తెలియజేశారు. రైతులకు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ బీజేపీ, బీఆర్ఎస్‌లు తమపైతప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి తుమ్మల విమర్శించారు.

Next Story