SLBC Incident : ఎస్ఎల్బీసీ ఘటనను రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

by Muthe.Rajitha |

స్ఎల్బీసీ టన్నెల్ ఘటనాస్థలాన్ని(SLBC Tunnel Incident) బీఆర్ఎస్ నేతల బృందం గురువారం పరిశీలించింది.

SLBC Incident : ఎస్ఎల్బీసీ ఘటనను రాజకీయం చేసే ఉద్దేశం మాకు లేదు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనాస్థలాన్ని(SLBC Tunnel Incident) బీఆర్ఎస్ నేతల బృందం గురువారం పరిశీలించింది. మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు టన్నెల్ వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్(SLBC Rescue Operation) పనులను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనను రాజకీయం చేయబోమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) పేర్కొన్నారు. కార్మికులు క్షేమంగా బయటికి రావాలని తాము కోరుకుంటున్నామని తెలియజేశారు. నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ప్రారంభించలేదని గతంలోనే కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారన్నారు. రెండు కొండల మధ్య ఉన్న టన్నెల్ భాగంలో ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు చెబుతున్నారని వెల్లడించారు. పనులు ప్రారంభించే ముందు ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఇక హరీష్ రావు మాట్లాడుతూ.. సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగవద్దనే ఇన్నిరోజులు ఇక్కడికి రాలేదని పేర్కొన్నారు. ఘటన జరిగిన 6 రోజుల తర్వాత కూడా ప్రమాదంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. నేడు తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబాలను దాచిపెట్టరని అన్నారు. మంత్రులు రోజూ హెలికాప్టర్లో వస్తున్నారు పోతున్నారని, అదేమన్నా టూరిస్ట్ స్పాట్ అనుకున్నారా అని హరీష్ రావు మండిపడ్డారు. ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్‌ పని చేయడం లేదని, ప్రమాదం జరిగిన ఇన్నిరోజుల తర్వాత తట్టెడు మట్టి మాత్రమే బయటకు తెచ్చారని.. హడావుడి చేయడం తప్ప ఏమీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు.

Next Story