- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాప్ కేవలం రైతుల సమయాన్ని ఆదా చేయాలని తీసుకొచ్చాం : మంత్రి తుమ్మల
కేంద్రం నుండి కేటాయింపులు ఆశించిన సమయానికి రాకపోవడంలో యూరియా సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం నుండి కేటాయింపులు ఆశించిన సమయానికి రాకపోవడంలో యూరియా సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. మొదటి రెండు పంట సీజన్‌లో యూరియా సరఫరాలో ఆటంకాలు లేకుండా ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు. 2024 వానాకాలం వినియోగం 9.66 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, 2025 లో ఇంతకంటే అధికంగా13 వేల మెట్రిక్ టన్నులు అనగా 9.79 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగిందన్నారు. సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరిపోయేంత యూరియా అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రతిపక్ష నాయకులు రైతులను మరింత భయపెట్టే విధంగా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారని మండిపడ్డారు.
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు ఏళ్ల కాలంలో సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది. యూరియా సరఫరాలో ప్రభుత్వం తీసుకురాదలుచుకున్న యాప్ అనేది కేవలం రైతుల సమయాన్ని ఆదా చేయాలనే ఉద్ధేశ్యంతో మాత్రమే అన్నారు. పచ్చకామర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండే వారికి తాము చేసే మంచి పని కూడా మోసంలాగే కనిపిస్తుందన్నారు. పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు, ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో ఎప్పటిలాగే వాళ్ళ స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదన్నారు.
యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో వారి సమయాన్ని వృథా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వం యాప్ ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు కావాలనే యాప్ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నారని, ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించామని తెలిపారు. దీనిని కూడా విజయవంతంగా అమలుచేసి, ప్రతిపక్ష నాయకుల అనుమానాలు పటాపంచల్ చేసి పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తామని స్పష్టం చేశారు.
బిఆర్ఎస్ నేతలు రుణమాఫీ గురించి మాట్లాడకుండా ఉంటే, కనీసం వారికి ఉన్న కాస్తో, కూస్తో గౌరవం ఉంటుందని, మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో కనీసం లక్ష రుణమాఫీ చేయడానికే నానా అవస్థలు పడి, నాలుగు వాయిదాలో చేస్తామని, 5 సంవత్సరాల సమయం తీసుకొని, సగం మందికి కూడా చేయని నాయకులా మా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికే వ్యవసాయరంగంలో సాంకేతికతను జోడించామని, భవిష్యత్తులో తెలంగాణ విజన్ 2047 కు అనుగుణంగా వ్యవసాయరంగాన్ని మార్చి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.






