కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అరెస్ట్ చేశాం.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

కూక‌ట్‌పల్లి (Kukatpally)లో మంగళవారం కల్లు కాంపౌండ్ల (Toad Compounds)లో కల్తీ కల్లు తాగి మొత్తం 19 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

కల్లు కాంపౌండ్ నిర్వాహకులను అరెస్ట్ చేశాం.. మంత్రి జూపల్లి కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: కూక‌ట్‌పల్లి (Kukatpally)లో మంగళవారం కల్లు కాంపౌండ్ల (Toad Compounds)లో కల్తీ కల్లు తాగి మొత్తం 19 మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానికులు వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించారు. అయితే, ఇవాళ వారిలో చికిత్స పొందుతూ ముగ్గురు పరిస్థితి విషమించి మృతి చెందారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ గాంధీ, నిమ్స్ ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కల్తీ కల్లు తాగి మొత్తం 19 మంది అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో 15 మంది, గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, ప్రైవేటు ఆస్పత్రిలో మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారని తెలిపారు. కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించని తెలిపారు. ఘటనకు కారణమైన కల్లు కాంపౌండ్‌లను సీజ్ చేశామని, నిర్వహకులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా కల్లు శ్యాంపిళ్లను కెమికల్ టెస్ట్ ల్యాబ్‌‌కు పంపించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కల్లు కాపౌండ్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చారు.

Next Story