Bhatti Vikramarka : ప్రతినెలా హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తాం : భట్టి విక్రమార్క

by Muthe.Rajitha |   (  Updated:2024-12-09 10:35:02  IST  )

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

Bhatti Vikramarka : ప్రతినెలా హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తాం : భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఇకపై ప్రతినెల ఒకరోజు తాను స్వయంగా గురుకుల, సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. తనతోపాటు ఉన్నతాధికారులంతా ఈ తనిఖీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆరోజు విద్యార్థులతో కలిసి భోజనం చేస్తామని, వారితో ముచ్చటిస్తామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని వసతులు కల్పిస్తామని.. ఇందుకోసం రూ.5 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. గత ఐదేళ్లలో హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని, హాస్టళ్లను పూర్తిగా గాలికి వదిలేశారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ ఛార్జీలు భారీగా పెంచామని భట్టి విక్రమార్క తెలియజేశారు. అలాగే విద్యార్థుల మధ్య ఎలాంటి బేధాలు లేకుండా అంతా ఒక దగ్గరే చదువుకునేలా రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్(Intigreated Schools) ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు ఏర్పాటు చేసి, విద్య అందిస్తామని పేర్కొన్నారు.

Next Story