- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)పై తీన్మార్ మల్లన్(Teenmar Mallanna) వ్యాఖ్యలు గర్హనీయం అన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud). మహిళలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని, కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఆయన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడి చట్ట వ్యతిరేకమని మండిపడ్డారు. చట్ట పరిధిలో అందరూ పని చేసుకోవాలని సూచించారు.
క్యూ న్యూస్ ఆఫీసుపై దాడి, గన్ మెన్ కాల్పులు జరిపిన అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై చట్ట పరిధిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేసారు. బిసి బిల్లు, రిజర్వేషన్లు అన్ని కాంగ్రెస్ కృషి ఫలితమేనని మహేష్ కుమార్ గౌడ్ మరోసారి పునరుద్ఘాటించారు. బిసి రిజర్వేషన్ల అంశంలో ఇతరులు లబ్ది పొందాలని చూడడం సమంజసం కాదని హితవు పలికారు.
Next Story






