- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం : మంత్రి పొంగులేటి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల మేరకు సమానత్వం, సామాజిక న్యాయం లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈనెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, అంబేద్కర్ ఉత్సవాల కమిటీ ఛైర్మన్ డాక్టర్ వీసాల మల్లేష్ ఆధ్వర్యంలో జై భీమ్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి సంబంధించిన వాల్ పోస్టర్ను గురువారం నాడు మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ నగరంలో నిర్వహించే సూటు- బూటు ర్యాలీని జయప్రదం చేయాలని అన్నారు. బషీర్ బాగ్‌లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి సచివాలయం సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ పోస్టర్ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, అంబేడ్కర్ఉత్సవాల కమిటీ ఛైర్మన్ వీసాల మల్లేష్, కో ఆర్డినేటర్ రాపోలు రాములు, కన్వీనర్లు బొమ్మర స్టాలిన్, గజ్జల మల్లిఖార్జున్, వరలక్ష్మి , బోరెళ్లి సురేష్ తదతరులు పాల్గొన్నారు.






