ప్రజల కోసం పనిచేస్తున్నాం.. వారికి నచ్చితేనే అధికారం : రేవంత్ రెడ్డి

by Sathputhe Rajesh |

4 కోట్ల తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల కోసం పనిచేస్తున్నాం.. వారికి నచ్చితేనే అధికారం :  రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: 4 కోట్ల తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్నారు. ప్రజలకు అండగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర సందేశాన్ని జనం వద్దకు తీసుకెళ్లాలని కార్యకర్తలు, నాయకులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకు నచ్చేట్టు పని చేయడమే ముఖ్యమని.. ప్రజల కోసం పని చేస్తున్నాం.. ప్రజలకు నచ్చితే అధికారం ఇస్తారని కామెంట్ చేశారు. ప్రజలకు నచ్చేలా పని చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.

Next Story