- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీరలు కట్టుకోవడం మనకు అలవాటు.. నటి రోహిణి కీలక వ్యాఖ్యలు
సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలకు సినీ నటి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలకు సినీ నటి రోహిణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళల పాత్ర, వస్త్రధారణ,సమానత్వం వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వస్త్రధారణ విషయంలో మహిళలకే నిబంధనలుగా మారుతున్న పరిస్థితిని ప్రశ్నించిన రోహిణి, ‘మగవారికి పద్ధతులు ఉండవా?’ అని నిలదీశారు. తాము పుట్టిన దేశ సంప్రదాయాల ప్రకారం వస్త్రధారణ ఉండాలంటే తప్పేంటని పేర్కొంటూ, ఈ వ్యాఖ్యలు హీరో శివాజీ, యాంకర్ అనసూయకు పరోక్ష కౌంటర్‌గా పలువురు భావిస్తున్నారు.
సమానత్వం రావాలి
మహిళలు ఇంట్లో చేసే పనికి సమాజంలో సరైన విలువ దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీతం లేని శ్రామికులుగా మహిళలు మిగిలిపోతున్నారని, ఈ పరిస్థితి మారాలంటే కుటుంబంలోనూ సమానత్వం రావాలని అన్నారు. అబ్బాయిలు కూడా ఇంటి పనులు, వంట పనులు చేయాలని స్పష్టం చేశారు. ఇక వస్త్రధారణ అంశంపై మాట్లాడుతూ, చీరలు కట్టుకోవడం మనకు అలవాటు. భారతదేశ సంప్రదాయం ప్రకారం మనం చీరలు కట్టుకుంటున్నాం. విదేశాల్లో వారు షార్ట్స్ వేసుకుంటారు. ప్రతి దేశానికి, ప్రతి సమాజానికి తన అలవాట్లు ఉంటాయని రోహిణి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ సంప్రదాయాలు, అలవాట్ల ప్రకారం మంచి దారిలో నడిపించాలని సూచించారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హితవు పలికారు.






