- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదాయం లేకపోయినా అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోయినా.. అప్పలకు మాత్రం క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోయినా.. అప్పులకు మాత్రం క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లిస్తూనే ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ ఆయన మధిర నియోజకవర్గం ఎర్రుపాలెంలో మీడియాతో మాట్లాడారు. గత పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) నిరుపేదలకు ఇండ్లు ఇస్తామని మభ్యపెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నామని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పేడితే.. రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా.. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని ఆదాయం లేకపోయినా అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు పేర్కొన్నారు. 90 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందజేస్తున్నామని అన్నారు.
అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు..
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకాన్ని ప్రారంభించామని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 2న లబ్ధిదారులకు ఆర్థిక సాయానికి సంబంధించి ధృవీకరణ పత్రాలను అందజేస్తామని అన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో సిబిల్ స్కోర్ (CIBIL Score) పేరుతో అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఫేక్ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు రూ.22,500 కోట్లు..
రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు ఇదిరమ్మ ఇండ్లు (Indiramma Houses) నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇళ్లు లేని వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇక వ్యవసాయం, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలపై పన్నుల భారం మోపకుండా కాంగ్రెస్ సర్కార్ (Congress Government) సమర్ధవంతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. త్వరలోనే ఇందిర సౌర గిరిజన వికాసం (Indira Soura Tribal Vikas) కింద ఆదివాసీ రైతులకు బోర్లు, సోలార్ పవర్‌తో నడిచే పంప్సెట్లు, డ్రిప్ పరికరాలను అందజేస్తామని అన్నారు. ఈనెల 18న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆ పథకాన్ని ప్రారంభించబోతున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలిపారు.






