Bar Owners: పర్మిట్ రూమ్‌ల వల్ల నష్టపోతున్నాం.. బార్ యజమానుల కీలక డిమాండ్

by Ramesh Naini |

పర్మిట్ రూమ్‌ల వల్ల నష్టపోతున్నామని బార్ యజమానుల ఆందోళన చేపట్టారు.

Bar Owners: పర్మిట్ రూమ్‌ల వల్ల నష్టపోతున్నాం.. బార్ యజమానుల కీలక డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (permit rooms) పర్మిట్ రూమ్‌ల వల్ల నష్టపోతున్నామని బార్ యజమానుల ఆందోళన చేపట్టారు. శుక్రవారం తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ (Telangana Bar and Restaurant Owners Association) సభ్యులు ఆబ్కారీ శాఖ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. బార్ల చుట్టూ ఉన్న వైన్ షాపుల్లో పర్మిట్ రూమ్‌లు ఉండటం వల్ల కస్టమర్లు బార్‌లకు రావడం తగ్గిపోయిందని బార్ యజమానులు అన్నారు. పర్మిట్ రూమ్‌ల బార్ల వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని, కొందరు యజమానులు బార్లు మూసివేయాల్సిన పరిస్థితిలో ఉన్నారని బార్ యజమానుల వెల్లడించారు.

గ్రామాలు, బస్తీల్లో బెల్ట్ షాపుల సంఖ్య పెరగడం వల్ల స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాల్లో వైన్ షాపులు ఉదయం 10:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు మాత్రమే పనిచేస్తుండగా, హైదరాబాద్, GHMC పరిధిలో రాత్రి 11:00 గంటల వరకు అనుమతించడంపై అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. GHMC పరిధిలోనూ జిల్లాల్లాగే సమయ పరిమితిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బార్‌ల ఆదాయం తగ్గిపోవడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా నష్టం జరుగుతుందని బార్ యజమానులు చెప్పుకొచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బార్ యజమానులు డిమాండ్ చేశారు.

Next Story