- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి
ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించడం జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నాం : డిప్యూటీ సీఎం భట్టి
- ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నాం..
- ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు లబ్ధి
- ఖమ్మంలో అట్టహాసంగా ప్రజాపాలన దినోత్సవం
దిశ బ్యూరో, ఖమ్మం: ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే అమలు చేయడం ప్రారంభించడం జరిగిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా బుధవారం ఖమ్మంలోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దీనిలో భాగంగా 2030 నాటికి 1 లక్ష 98 వేల కోట్ల పెట్టుబడితో 20వేల మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి ద్వారా 1,14,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు చేపట్టామన్నారు. ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం కింద 2025- 26 ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్న మంది తెలిపారు . పేదల సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైందని గత పది సంవత్సరాలుగా నిరుపేదలకు రేషన్ కార్డులు జారీలో అప్పటి పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ విషయాన్ని ప్రజా ప్రభుత్వం గమనించి అర్హులైన పేద కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు జారీ చేసి ప్రతి వ్యక్తికి ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 24, 818 మంది కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు జారీ చేశామని దాని ద్వారా 1 లక్ష 3 వేల 166 కుటుంబాలు కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నారన్నారు.
ఆర్థికస్థితులు గాడిలో పెడుతూ..
ఆర్ధిక స్థితిగతులను గాడిలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన అభయ హస్తం గ్యారంటీ పథకాలైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి,500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వము అమలు చేస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 4 కోట్ల 44 లక్షల48 వేల224 ఉచిత బస్సు ప్రయాణాలు చేయడం వల్ల మహిళలు 209 కోట్ల 21 లక్షల 46 వేల రూపాయలు ఆదా చేశారు అన్నారు. గృహ జ్యోతి పథకం కింద జిల్లాలో ప్రభుత్వం చే 160 కోట్ల 30 లక్షల రూపాయల సబ్సిడీ చెల్లించి 2 లక్షల43 వేల 852 కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని తెలిపారు. పేదల సొంత ఇంటి కల సాకారానికి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మండ్ల పథకాన్ని అమలు చేస్తుందని ఈ పథకంలో ఐదు లక్ష రూపాయలు ఇంటి నిర్మాణానికి పూర్తిసబ్సిడీతో లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తున్నామన్నారు. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలో నియోజకవర్గంలో 3500 ఇండ్లు మంజూరు చేశామన్నారు. నిరు పేదలకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం పరిమితి ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు.ఖమ్మం జిల్లాలో 1257 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో 70,257మంది విద్యార్థులు విద్యార్థులు ఉచితంగా విద్యను పొందుతున్నారని తెలిపారు. జిల్లాలో మధిర, సత్తుపల్లి పట్టణాల్లో 34 కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ వంద పడకల ఆసుపత్రులను కల్లూరులో 10 కోట్ల 50 లక్షలతో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను, పెనుబల్లిలో ఏడు కోట్ల యాభై లక్షలతో ముప్పై పడక కమ్యూనిటీ సెంటర్ ను పూర్తి చేయడం జరిగింది అన్నారు. పాలేరు, సత్తుపల్లి పట్టణాలలొ 25 కోట్ల తోపున ఖర్చు చేసి చేపట్టిన నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు వైరా పట్టణంలో 37 కోట్ల 50 లక్షల ఖర్చులు చేపట్టిన 100 పడకల ఆసుపత్రి భవనం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో 23 కోట్ల 50 లక్షలతో చేపట్టిన క్రిటికల్ కేర్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. వన మహోత్సవం కార్యక్రమం కింద 35 లక్షల 32 వేల మొక్కలు నాటడం లక్ష్యంగా చేపట్టడం జరిగిందని ఇప్పటివరకు 29 లక్షల 100 మొక్కలు నాటడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






