Komatireddy: ప్రతీ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చబోతున్నాం

by Gantepaka Srikanth |

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.74 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) శంకుస్థాపన చేశారు.

Komatireddy: ప్రతీ రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చబోతున్నాం
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.74 కోట్లతో అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. భారీ ర్యాలీతో స్వాగతించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి రోడ్డును డబుల్ రోడ్డుగా మార్చబోతున్నామని కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో కేఎన్ఎం డిగ్రీ కాలేజీని ప్రభుత్వ పరం చేసినది కాంగ్రెస్‌ అని గుర్తుచేశారు. తెలంగాణలో ఇంకా 15 ఏళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని.. ఆలోపే ఉమ్మడి నల్లగొండ జిల్లాను సంపూర్ణంగా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.

Next Story