- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోల్‌కతా ఘటన నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం.. సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా పర్యటన సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి (Lionel Messi)ని కళ్లారా చూసేందుకు సాల్ట్‌లేక్ స్టేడియానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా పర్యటన సందర్భంగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సి (Lionel Messi)ని కళ్లారా చూసేందుకు సాల్ట్‌లేక్ స్టేడియానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే, నిర్వాహకులు, పోలీసుల వైఫల్యం కారణంగా మెస్సి మ్యాచ్ ఆడకుండానే స్టేడియం నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహానికి గురైన అభిమానులు స్టాల్‌లేక్ స్టేడియంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు నిరసన తెలిపారు.
ఈ క్రమంలోనే కాసేపట్లో లియోనల్ మెస్సి, రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు వస్తున్న తరుణంలో భద్రతా ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతా ఘటన నేపథ్యంలో తాము మరింత అప్రమత్తమయ్యామని అన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు మెస్సీ, రాహుల్, సీఎం రేవంత్‌రెడ్డి వెళ్తారని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. మరోవైపు రాచకొండ కమిషనర్ ఎప్పటికప్పుడు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారని, భద్రత విషయంలో నో టెన్షన్ అంటూ సజ్జనార్ చెప్పుకొచ్చారు.






