- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijayashanthi : బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం : విజయశాంతి
కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి(Vijayashanthi) ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC) అభ్యర్థిగా ఏఐసీసీ(AICC) విజయశాంతిని ప్రకటించిన నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ- బీఆర్ఎస్(BJP-BRS) మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తాము తెలంగాణలో ఉద్యమకారులమని, ఉద్యమకారిణిగా కాంగ్రెస్ ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకుల్లా అడుక్కోవడానికి తామేం బిచ్చగాళ్ళం కాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఓడించేందుకు బీజేపీ నాయకులు తనను వారి పార్టీలోకి ఆహ్వానించారని.. కానీ లోపల మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ తో చీకటి ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. అందుకే తాను బీజేపీ నుంచి బయటకి వచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. బీసీ మహిళా నేతగా.. నా అవసరాన్ని కాంగ్రెస్ గుర్తించిందని, అందుకే తనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించారని తెలియజేశారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గౌరవం లభిస్తుందని అన్నారు. తనను కేబినేట్ లోకి తీసుకోవడంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటానని విజయశాంతి వెల్లడించారు.






