- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరగేసి కొట్టడానికి మా దగ్గర కండలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారు.. సభలో సీఎం వ్యాఖ్యలు అంతా నవ్వులు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వైపు కూడా కండలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలతో సభలో నవ్వులు పూశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ శాసన సభలో ఇవాళ ఉదయం నుంచి హైడ్రామా నడిచింది. మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాల విషయంలో ప్రతిపక్ష, అధికార పక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లు రాజకీయం సాగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (CM Revanth Reddy) సభలో వ్యవహరించిన తీరు తీవ్ర దుమారం రేపింది. సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతుండగా గన్‍తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగల్ చేశారనే ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ క్రమంలో సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా? అని ప్రశ్నించారు.
మా వైపు కండలు తిరిగిన ఎమ్మెల్యేలున్నారు:
ఇవాళ కడియం శ్రీహరికి జరిగిందే రేపు కేసీఆర్ కు జరిగితే మీరు సమర్ధిస్తారా? మావైపు కూడా కండలుతిరిగిన మా దగ్గర కూడా తిరగేసి కొట్టడానికి కండలు తిరిగిన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఇక్కడ కుల్తీలు పడటానికి రాలేదు. విజ్ఞత, అవగాహనతో మాట్లాడటానికి వచ్చామన్నారు. ఆకారం ఉంది కదా అని కడియం లాంటి పెద్దమనిషిని అవమానించేలా వ్యవహరించిన కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయన్నారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి, ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా సీరియస్ వ్యాఖ్యల మధ్య తమ వైపు కూడా కండలు తిరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారంటూ సీఎం చేసిన కామెంట్స్ తో సభలో నవ్వులు పూశాయి.






