Wayanad : ‘వయనాడ్‌’‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీపీఐ నారాయణ డిమాండ్

by Ramesh Naini |

వయనాడ్‌ ఘటనను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

Wayanad : ‘వయనాడ్‌’‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి : సీపీఐ నారాయణ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వయనాడ్‌ ఘటనను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. సీపీఐ వయనాడ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆదివారం వయనాడ్ ముప్పు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముప్పు ప్రాంతంలో దాదాపు 416 మంది ప్రాణ నష్టం అందులో 47 మంది సీపీఐ నాయకులను కోల్పోవడం జరిగిందన్నారు.

ఈ వయనాడ్ సందర్శన అనంతరం నాకు చాలా బాధాకరంగా ఉంది అని తెలిపారు. నిన్న ప్రధాని వయనాడ్ జిల్లాను సందర్శించారని గుర్తుచేశారు. ముప్పు ప్రాంతాల్లో సందర్శించడం తాము స్వాగతిస్తున్నాం అన్నారు. ప్రధాని కేవలం సందర్శనకే పరిమితమా లేక వారికి ఏమైనా చేసేది ఉందా? అని ప్రశ్నించారు.

Next Story