Minister Uttam : పంటలకు నీళ్లివ్వండి : మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు ఫోన్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-03-01 12:17:47  IST  )

సిద్దిపేట నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకునేందుకు మిడ్ మానేరు(Maneru) నుండి 1 టీఎంసీల నీటిని రంగనాయక సాగర్(Ranganayaka Sagar)లోకి ఎత్తి పోయాలని(Lifted water to crops) నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి మాజీ మంత్రి టి.హరీష్ రావు (Harish Rao)ఫోన్ ద్వారా అభ్యర్థించా(Requested by phone)రు

Minister Uttam : పంటలకు నీళ్లివ్వండి : మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్ : సిద్దిపేట నియోజకవర్గంలో ఎండిపోతున్న పంటలను కాపాడి రైతులను ఆదుకునేందుకు మిడ్ మానేరు(Maneru) నుండి 1 టీఎంసీల నీటిని రంగనాయక సాగర్(Ranganayaka Sagar)లోకి ఎత్తి పోయాలని(Lifted water to crops) నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని మాజీ మంత్రి టి.హరీష్ రావు (Harish Rao)ఫోన్ ద్వారా అభ్యర్థించా(Requested by phone)రు. యాసంగి పంట పూర్తి అయ్యేంత వరకు పంట పొలాలకు సాగు నీటిని అందించాలని కోరినట్లుగా హరీష్ రావు ఎక్స్ వేదికగా వెల్లడించారు.

రంగనాయక సాగర్ కింద ప్రతి యేటా గణనీయంగా పంట రాబడి పెరుగుతుందన్నారు. ఈ ఏటా 50 వేల ఎకరాల పంట ఉన్నదని ఫోన్ లో మంత్రి ఉత్తమ్ కు హరీష్ రావు వివరించారు. రంగనాయక సాగర్ లో ఇటీవల మీరు 2.4 టీఎంసీల నీళ్లు పంపింగ్ చేశారని ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 1.5 టీఎంసి ల నీరు మాత్రమే అందుబాటులో ఉన్నాయని చెప్పారు

యాసంగి పంటకు పూర్తి స్థాయిలో నీరు అందాలి అంటే ఇంకా కనీసం 1 టీఎంసీల నీళ్లు అవసరం ఉన్నాయన్నారు . కావున మిడ్ మానేరు నుండి రంగనాయక సాగర్ లోకి వెంటనే నీళ్లు పంపింగ్ చేయాలనీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించగలరని విజ్ఞప్తి చేశారు. రైతులు సాగు నీళ్లు లేక పంటలు ఎండి పోయే పరిస్థితి ఉందని, అన్నదాతలు తీవ్ర ఆందోళన లో ఉన్నారని గుర్తు చేశారు. పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి కి రైతులకు సాగు నీరు అందించినట్టుగా ఈ యాసంగి పంట కాలం పూర్తి అయ్యే అంత వరకు రైతుల పంట పొలాలకు సాగు నీరు అందిచాలని సిద్దిపేట నియోజకవర్గ రైతుల పక్షాన తమరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఫోన్ ద్వారా హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ను అభ్యర్థించారు.

Next Story