KTR : మళ్లీ నీటి తీరువా వసూళ్లా ? : కేటీఆర్ ఫైర్

by Y. Venkata Narasimha Reddy |

బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువా వసూళ్ల(Water Tax Collections)ను..కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మళ్లీ పునద్ధరించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR : మళ్లీ నీటి తీరువా వసూళ్లా ? : కేటీఆర్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువా వసూళ్ల(Water Tax Collections)ను..కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) మళ్లీ పునద్ధరించడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల తరువాత ఇప్పుడు మళ్లీ వసూళ్లకు తెగబడతారా ? అంటూ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రుణం కట్టలేదని నిన్న ఓ రైతు ఇంటి గేటు ఎత్తుకెళ్లారని..నేడు స్టార్టర్లు పీక్కెళ్లారని..ఇక రేపు పుస్తెలతాళ్లు లాక్కెళతారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డలారా...! ఈ తెలివితక్కువ కాంగ్రెస్ సర్కారుతో జెర పైలమని కేటీఆర్ హెచ్చరించారు.

అప్పుల పాలైన అన్నదాతలపై ఇంత కక్షనా ? కష్టాల్లో ఉన్న కర్షకులపై కాంగ్రెస్ కు ఇంత కోపమా ? అని ప్రశ్నించారు. సాగు నీళ్లిచ్చే సోయి లేదు..పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు.. కానీ..రైతులు అష్టకష్టాలు పడుతుంటే వేధింపులా ? అని నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన నీటితీరువాను.. ఐదేళ్ల తరువాత ఇప్పుడు వసూళ్లకు తెగబడతారా ? తెలంగాణ రైతులంటే అంత అలుసైపోయారా ? ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి గద్దెనెక్కాక నరకం చూపిస్తారా ?? అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్ళలు గుప్పించారు.

2 లక్షల రుణమాఫీ సక్కగ చేయని..సన్నాసులు ఇంత దారుణానికి ఒడిగడతారా ? రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి..రైతన్నను సంక్షోభంలోకి నెట్టింది మీరు కాదా?? అని ప్రశ్నించారు. పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి..మళ్లీ అప్పులపాలయ్యేలా చేసిన పాపం మీది కాదా కాదా అంటూ విమర్శించారు.

ఆత్మగౌరవంతో బతికే అన్నదాతలపై ఈ వరుస దాష్టీకాలేంటి ? మీరు చేసిన పాపాలకు బక్కచిక్కిన రైతులపై ఈ దుర్మార్గాలేంటి ? వ్యవసాయరంగంలో సంతోషం ఆనవాళ్లు చెరిపేసి.. సమైక్యరాష్ట్రంలో పీడించిన సంక్షోభం ఆనవాళ్లను..తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతాంగం సహించదని..సంఘటితంగా పోరాడుతది..! సీఎంకు బుద్ధి చెబుతదని కేటీఆర్ హెచ్చరించారు.

Next Story