హైదరాబాద్‌లో నీళ్ల పెట్రోల్.. షాకింగ్ వీడియో వైరల్!

by Ajay Maddhiboyina |

పెట్రోల్ బంకుళ్లో రోజుకో రకమైన మోసం బయటపడుతుంది. ఇటీవల ఓ బంకులో రీడింగ్ తప్పు చూపిస్తూ మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎక్కువ తీసుకుంటూ పెట్రోల్ తక్కువ కొట్టి అడ్డంగా దొరికిపోయారు.

హైదరాబాద్‌లో నీళ్ల పెట్రోల్.. షాకింగ్ వీడియో వైరల్!
X

దిశ, వెబ్ డెస్క్: పెట్రోల్ బంకుళ్లో రోజుకో రకమైన మోసం బయటపడుతుంది. ఇటీవల ఓ బంకులో రీడింగ్ తప్పు చూపిస్తూ మోసానికి పాల్పడిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎక్కువ తీసుకుంటూ పెట్రోల్ తక్కువ కొట్టి అడ్డంగా దొరికిపోయారు. కాగా తాజాగా మరో రకమైన మోసం బయటపడింది. ఏకంగా పెట్రోల్‌లో నీళ్లు వచ్చాయి. హైదరాబాద్‌లోని షెర్రిగూడ పరిధిలోని ఓ బంక్‌లో నిన్న రాత్రి మహేష్ అనే కస్టమర్ బ్రెజా కారులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. అయితే అతడి కారు మధ్యలోనే ఆగిపోవడంతో మెకానిక్ దగ్గరకు వెళ్లాడు. చెక్ చేసిన మెకానిక్ పెట్రోల్ లో నీళ్లు ఉన్నాయని చెప్పాడు. దీంతో కస్టమర్ అదే బంకుకు వెళ్లి బాటిల్‌లో పెట్రోల్ కొట్టించగా అందులో నీళ్లు కనిపించాయి. దీంతో సిబ్బందిని నిలదీసి వారితో గొడవకు దిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story