CM Revanth Reddy: ఎల్లుండి కేంద్ర మంత్రితో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ.. సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం

by Prasad Jukanti |   (  Updated:2025-07-14 13:28:37  IST  )

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM Revanth Reddy: ఎల్లుండి కేంద్ర మంత్రితో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ..  సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చిద్దామని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇవాళ సమాచారం ఇచ్చింది. ఈ నెల 16న ఢిల్లీకి రావాలని, కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవడం న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు. కృష్ణాతో పాటు గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించుకోవటంతో పాటు, ఇంతకాలం జరిగిన అన్యాయానికి శాశ్వతమైన పరిష్కారాలను సాధించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖ రాశారు. ఈ మేరకు ఈనెల 16వ తేదీన ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించబోతున్నది.

Next Story