- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Uttam : ప్రాజెక్టులతో నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయి : మంత్రి ఉత్తమ్
కేసీఆర్ ప్రభుత్వం(KCR) హయాంలో చేపట్టిన ప్రాజెక్టులతో నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి(Irrigation Minister) ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : కేసీఆర్ ప్రభుత్వం(KCR) హయాంలో చేపట్టిన ప్రాజెక్టులతో నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి(Irrigation Minister) ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) విమర్శించారు. కేసీఆర్ హయాంలో లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి పాలనా కాలంలోనే కూలిపోయిందని...పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని ఉత్తమ్ ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పాలకులు పూర్తి వైఫల్యం చెందారని, రాష్ట్రానికి రావాల్సిన నది జలాల వాట కోసం కేంద్రంతో పోరాడకుండా తెలంగాణకు అన్యాయం చేశారని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
గత పాలకుల అసమర్ధత కారణంగా తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు 299 టీఎంసీలు ఉంటే కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడగలిగారని తెలిపారు. పాలమూరు రంగా రెడ్డి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో సాగునీటి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయన్ని సరి చేయలేదని విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావు పలు మార్లు జరిగిన సమావేశాల్లో తెలంగాణకు అన్యాయం జరిగేలా వ్యవహరించారని, పదేండ్ల పాటు అధికారంలో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారని..ఏపీ జల దోపిడీకి సహకరించారని విమర్శించారు. తె
లంగాణకు పదేండ్ల పాటు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా వారు నిర్ణయం తీసుకున్నారని...జీవో 203 తో ప్రతీ రోజు 3 టీఎంసీలు తరలించేలా జగన్ చేసిన ప్రయత్నాలకు సహకరించారని బీఆర్ఎస్ పాలకులపై ఉత్తమ్ మండిపడ్డారు. ఆఖరికి ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను కూడా.. ఏపీకి సహకరించేలా వ్యవహరించారని, రాయలసీమ లిఫ్ట్ పనుల కోసం ఆపేక్స్ కౌన్సిల్ మీటింగ్ ను వాయిదా వేశారని ఆరోపించారు. జగన్ తో విందు వినోదాలు చేసుకొని.. తెలంగాణకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదని, నీటి కేటాయింపుల పొరపాట్లను మేము వచ్చాకే సరి చేస్తున్నామని ఉత్తమ్ వెల్లడించారు.
కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని తాజాగా జాతీయ నీటి పారుదల శాఖ మంత్రుల సదస్సులో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కు వివరించామని వెల్లడించారు. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి బీఆర్ఎస్ పాలకులు రుణాలు తెచ్చారని..ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించామని ఉత్తమ్ తెలిపారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్లను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కూలితే.. స్వయంగా ఎన్డీఎస్ఏ(Ndsa) రంగంలోకి దిగి విచారణ చేపట్టిందని, బేసిక్ విచారణలోనే.. ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందన్నారు. నీళ్లు నింపవద్దని స్వయంగా ఎన్డీఎస్ఏ లిఖిత పూర్వకంగా లేఖ రాసిందని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను, పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.






