Kavitha : కాంగ్రెస్ పాలనలో మళ్లీ నీళ్ల కోసం అరిగోస : కవిత

by Y. Venkata Narasimha Reddy |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)విధానాలపై వరుస విమర్శలు..ఆందోళనలు కొనసాగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) వేసవి ఆరంభానికి ముందే గోదావరి వట్టిపోయిన(Godavari Dried) తీరును ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

Kavitha : కాంగ్రెస్ పాలనలో మళ్లీ నీళ్ల కోసం అరిగోస : కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)విధానాలపై వరుస విమర్శలు..ఆందోళనలు కొనసాగిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) వేసవి ఆరంభానికి ముందే గోదావరి వట్టిపోయిన(Godavari Dried) తీరును ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తలాపునే గోదావరి ఉన్నా, గుక్కెడు నీటి కోసం మళ్లీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం 'గ్యారెంటీ'గా తెచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కోల్ బెల్ట్ వంతెన వద్ధ ఎండిపోయిన గోదావరి నది చిత్రాన్ని కవిత ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు వంద కిలోమీటర్ల పొడవునా గోదావరిని సజీవ జలధారగా మార్చిందని కవిత పేర్కొన్నారు. మండే ఎండాకాలంలోనూ సుందిళ్ల బ్యారేజీ బ్యాక్ వాటర్ గోదావరిని నిండు కుండలా కలకళలాడేలా చేసిందని.. అయితే కేసీఆర్(KCR) పై కక్షతో కాళేశ్వరం బ్యారేజీలను కాంగ్రెస్ సర్కారు ఎండబెట్టిందని కవిత విమర్శించారు. 2014కు ముందులా ఫిబ్రవరిలోనే గోదావరి వట్టిపోయి ఎడారిని తలపిస్తోందని.. ఇప్పుడే ఇట్లా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఇంకెంత దారుణంగా మారుతుందోనని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తలాపునే గోదావరి ఉన్నా, గుక్కెడు నీటి కోసం మళ్లీ అరిగోస పడే రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం 'గ్యారెంటీ'గా తెచ్చిందంటూ మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం..అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలోనూ లీకేజీల నేపథ్యంలో వాటిలో నీటి నిల్వను చేయడం లేదు. దీంతో గోదావరి నదిలో పెద్దపల్లి జిల్లా కోల్ బెల్ట్ వంతెన వద్ధ సుందిళ్ల బ్యారేజీలో నీటి నిల్వ లేక నది ప్రాంతం ఇసుక తిన్నెలు తేలడంతో పాటు నది గర్భంలోని ఇన్ ఫిల్ట్రేషన్ బావులు పైకి తేలి కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో గోదావరి నది పిల్ల కాలువలను తలపిస్తుండటాన్ని కవిత తన పోస్టులో ప్రస్తవిస్తూ గోదావరి ప్రస్తుతం వట్టిపోయి కనిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం బ్యారేజీలను వాడుకోకపోవడమే కారణమంటూ విమర్శలు గుప్పించారు.

Next Story