- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో జలమండలి ప్రతిభకు ముద్ర: మూడు పీఆర్ఎస్ఐ అవార్డులు సొంతం
జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతుంది. ఈ ఏడాది ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న జలమండలి... తాజాగా మరో మూడింటిని తన ఖాతాలో వేసుకుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జలమండలికి అవార్డుల పరంపర కొనసాగుతుంది. ఈ ఏడాది ఇప్పటికే పలు అవార్డులు గెలుచుకున్న జలమండలి... తాజాగా మరో మూడింటిని తన ఖాతాలో వేసుకుంది. పీఆర్ఎస్ఐ (పబ్లిక్ రిలేషన్స్ సోసైటీ ఆఫ్ ఇండియా) తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్- తెలంగాణ రైజింగ్-2047 భాగంగా సోసైటీ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో జలమండలికి మూడు బహుమతులు లభించాయి. ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాల పెంపునకు అవగాహన కోసం బ్రోచర్ రూపొందించిన జలమండలి.. వివిధ మాధ్యమాల్లో ప్రజలకు అవగాహన కల్పించింది.. దానికి మొదటి బహుమతి లభించింది.
ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యం
సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా జలమండలి చేపట్టిన 90 రోజులు స్పెషల్ డ్రైవ్ పైన రూపొందించిన డాక్యుమెంటరీకి కార్పొరేట్ వీడియో ప్రొడక్షన్ డెవలప్‌మెంట్ ఫీచర్ విభాగంలో ద్వితీయ బహుమతి లభించింది. అలాగే ఇంకుడు గుంతల నిర్మాణంపై సాంకేతిక సమాచారంతో వివరణాత్మకంగా రూపొందించిన పోస్టర్ కు “బెస్ట్ లేఅవుట్ & డిజైన్" కేటగిరీలో ద్వితీయ బహుమతి లభించింది. హైదరాబాద్ బేగంపేట లోని టూరిజం ప్లాజాలో ఆదివారం జరిగిన పీఆర్ఎస్ఐ తెలంగాణ పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్ లో విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ప్రియాంక ఐఏఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్ కలిసి జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, పీఆర్వో సుభాష్, గ్రౌండ్ వాటర్ ఎక్స్పర్ట్ సత్యనారాయణకు ఈ అవార్డులు అందించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ.. దీని కోసం కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.






