- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పహారా.. నేతలంతా అలర్ట్!
కాంగ్రెస్ అభ్యర్ధులు, కీలక నేతలంతా స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పహారా కాయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలకు ఆదేశాలిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అభ్యర్ధులు, కీలక నేతలంతా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పహారా కాయాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్ని జిల్లాలకు ఆదేశాలిచ్చారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు అలర్ట్ గా ఉండాలని పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన తన నివాసంలో అన్ని జిల్లాల్లో ని పోలింగ్ సరళిపై సమీక్షించారు. ఎక్కడెక్కడ పోలింగ్ ఎక్కువ అయింది? తక్కువైన సెగ్మెంట్లు ఏమిటీ? అందుకు గల కారణాలేంటి? అనే వివరాలను ఆయన స్థానిక నేతల నుంచి అడిగి తెలుసుకున్నారు.
అనుమానం ఉన్న స్ట్రాంగ్ రూమ్‌లపై ఎప్పడికప్పుడు వార్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ శ్రేణులు నిఘాతో పనిచేయాలని, వంద శాతం పవర్‌లోకి వస్తున్నామని ధీమాను వ్యక్తం చేశారు. ఇక పోలింగ్ డే రోజు అల్లర్లు, కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్ధుల మధ్య జరిగిన వాగ్వాదాలు, కార్యకర్తల సమస్యలు, వంటి అంశాలపై రేవంత్ ఆరా తీశారు. అధికారంలోకి రాగానే అన్ని సర్దుకుంటాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,చంద్రశేఖర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, బండి రమేష్ తదితరులు ఉన్నారు.






