Jubilee Hills: రేవంత్ రెడ్డి మాటలు విని షాకయ్యా: రాజ్ నాథ్ సింగ్

by Prasad Jukanti |

జూబ్లీహిల్స్ ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ స్పందించారు.

Jubilee Hills: రేవంత్ రెడ్డి మాటలు విని షాకయ్యా: రాజ్ నాథ్ సింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills by-election) ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రాజ్‍నాథ్ సింగ్ (Rajnath Singh) కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాటలను విని నేను షాక్ కు గురయ్యాయనని హిందువులు, ముస్లింల మధ్య విభజన సృష్టించడం ద్వారా కాంగ్రెస్ రాజకీయ విజయం సాధించారని దుయ్యట్టారు. బిహార్ లో రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రోహ్తాస్ లోని దినారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన రాజ్‍నాథ్ సింగ్.. మేము కులం, మతం, విశ్వాసాల ఆధారాంగా రాజకీయాలు చేయమన్నారు. మాకు గెలుపు ఓటములు ఎలా ఉన్నా కులం, మతం, నమ్మకాలపై రాజకీయం చేయమని న్యాయం, మానవత్వం ఆధారంగానే రాజకీయాలు చేస్తామన్నారు.

బిహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ ప్రజలకు అబద్ధాలు చెప్పి విజయం సాధించాలని చూస్తున్నారని ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నారని రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. బిహార్‍లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ నిజంగా భావిస్తే ఎన్నికల సంఘానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. రాహుల్ గాంధీ విజయవంతమైన రాజకీయ జీవితం గడపడానికి అబద్ధాలు చెప్పడం మఖ్యమా? అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల గురించి రాహుల్ గాంధీ అంతగా ఆందోళన చెందుతుంటే లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి అవకాశం వారికి ఇవ్వకుండా తానే ఎందుకు తీసుకున్నట్టు? ఆ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీనవర్గాల వారికి ఎందుకు చాన్స్ ఇవ్వలేదని నిలదీశారు. ఎన్డీయేలో అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

Next Story