- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Heavy Rains Alert: తెలంగాణలో అతి భారీ వర్షాల హెచ్చరిక.. కొన్ని చోట్ల వరదలు వచ్చే ఛాన్స్!
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా జూలై 6 నుంచి 9 తేదీల్లో తాజాగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జూలై 7 నుంచి 8 తేదీల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల 150-220 మి.మీ అతి భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది.
దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆదివారం ఎక్స్ వేదికగా ప్రముఖ వాతావరణ నిపుణుడు, తెలంగాణ వెదర్‌మెన్ (Telangana Weatherman) బాలాజీ హెచ్చరించారు. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో ముసురుతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాలలో పలు చోట్ల రాబోయే 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నేడు, సాయంత్రం అక్కడక్కడ స్వల్పకాలిక వర్షాలు, జూలై 7-8 తేదీల్లో ముసురుతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్‌మెన్ తెలిపారు.






