నేనున్నా మీకు అండగా.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్..

by Disha Web Desk 20 |
నేనున్నా మీకు అండగా.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్..
X

దిశ, మల్హర్ : మండలంలోని అన్సాన్పల్లి, నాచారం గ్రామాల్లో పెద్దపెల్లి జడ్పీ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ ఆదివారం పర్యటించారు. వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి మీకు నేను అండగా ఉన్న మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు అంటూ భరోసా ఇస్తూ గ్రామాల్లో పర్యటించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మల్క సూర్య ప్రకాష్ రావు, తాడిచర్ల ఎంపీటీసీ రావుల కల్పన మొగిలి, మంథని మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పుట్టపాక శ్రీనివాస్ ఉన్నారు.

పర్యటనలో భాగంగా నాచారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుమ్మరి రజిత చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయనతో పాటు స్థానిక పార్టీ నాయకులు కాసాని శ్రీశైలం, మాజీ సర్పంచ్ లు ఎడ్ల సుధాకర్, స్వరూప, నాయకులు సది, సమ్మయ్య, మహేందర్, వాజీద్, రవి, సమ్మక్క, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed