- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : ఎస్పీ సంకీర్త్
యువత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని భూపాలపల్లి ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ అన్నారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : యువత గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని భూపాలపల్లి ఎస్పీ సిరిసెట్టి సంకీర్త్ అన్నారు. భూపాలపల్లి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నాలుగో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమంలో జిల్లాలోని 13 పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులకు వాలీబాల్, కబడ్డీ క్రీడా పోటీలు నిర్వహించారు. యువతలో ఐక్యత, క్రమశిక్షణ మ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ యువత గంజా వంటి మాదక ద్రవ్యాలకు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు.
యువతకు ఏదైనా సమాచారం తెలిసినా భయ పడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవని, పోలీసులు ఎల్లప్పుడూ యువతకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. యువత, పోలీసులు కలిసి పని చేస్తే సమాజంలో శాంతి భద్రతలు మరింత బలపడతాయని అన్నారు. అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వాలీబాల్ పోటీల్లో భూపాలపల్లి టీం ప్రథమ బహుమతి, మహాదేవపూర్ టీం ద్వితీయ బహుమతి గెలుచుకోగా, కబడ్డీ పోటీల్లో మహాముత్తారం టీమ్ ప్రథమ బహుమతి, మహాదేవపూర్ టీం ద్వితీయ బహుమతి సాధించింది. విజేతలకు షీల్డ్‌లు, మెడల్స్‌తో పాటు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, ఆర్‌ఐ పూర్ణచందర్ తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






