- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంజాయి మత్తును నుంచి యువతను కాపాడాలి
యువత గంజాయి మత్తుకు బానిసలు కాకుండా గంజాయి వియ్రించే మూలాలపై దృష్టి పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు.

దిశ, వరంగల్ బ్యూరో : యువత గంజాయి మత్తుకు బానిసలు కాకుండా గంజాయి వియ్రించే మూలాలపై దృష్టి పెట్టాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. కమిషనరేట్ పరిదిలో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం కాకతీయ మెడికల్ కళాశాలలో ఎర్పాటు చేసారు. ఈ సమావేశంలో ముందుగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ప్రస్తుతం దర్యాప్తులో వున్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. పేకాటరాయుళ్ళపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. శివారు ప్రాంతాల్లో స్థానిక పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని,చోరీలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని అన్నారు. చోరీలు జరిగే ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు.
MGM రైల్వే స్టేషన్ల ప్రాంతాల్లో సైతం సిసి కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని అన్నారు. స్టేషన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేయాలన్నారు. గంజాయి వినియోగదారున్ని పట్టుకోవడంతో మన బాధ్యత అయిపోతుందని అనుకొంకుండా గంజాయిని వియ్రించే వారి గుర్తించి అరెస్టు చేయాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ ఇసుక రవాణాపై స్టేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎవరైన ఆలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని అన్నారు., అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారులు దష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్,రాజమహేంద్ర నాయక్,కవిత, శుభంనాగ్‌తో పాటు అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, అర్.ఐలు ఎస్.ఐలు పాల్గోన్నారు.






