మనస్తాప౦తో యువకుడు ఆత్మహత్యాయత్నం(వీడియో)

by S Gopi |   (  Updated:2023-03-24 17:58:25  IST  )

మనస్తాప౦తో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి.....young man attempted suicide

మనస్తాప౦తో యువకుడు ఆత్మహత్యాయత్నం(వీడియో)
X

దిశ, ఏటూరునాగారం: మనస్తాప౦తో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన నూనె రవి, నూనె లక్ష్మీల దంపతుల కొడుకు నూనె రాకేష్(25) గత మూడు రోజుల క్రితం చిన్నబోయినపల్లిలో కరెంటు రావడం లేదని ఆగ్రహించి ఏటూరునాగారంలోని పవర్ ఆఫీస్ లో అడుగగా పవర్ ఆఫీస్ సిబ్బంది కరెంట్ ఆఫీసులో దౌర్జన్యం చేశాడని స్థానిక ఎటూరునాగారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, రాకేష్ కు కొంతకాలంలో నేవీలో జాబు రానుందని, దానికి సంబంధించిన వీసా కూడా రావాల్సి ఉండగా ఈ పిటిషన్ వల్ల తనకు వీసా రాదన్న మనస్తాపంతో మంగళవారం సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని గమనించిన గ్రామ ప్రజలు రాకేష్ ను ఏటురునాగారంలోని స్రవంతి నర్సింగ్ హోమ్ కు తరలించారు. కాగా, రాకేష్ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story