రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి

by velandi.Saikiran |

పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా

రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి
X

దిశ, పాలకుర్తి: పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో భారత రత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ... రాజీవ్ గాంధీ భారతదేశానికి ఆధునికతకు నాంది పలికిన దూరదృష్టి కలిగిన నాయకుడని, దేశాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి చేసిన కృషి మరువలేనిదని తెలిపారు.


ఆయన ప్రవేశపెట్టిన సాంకేతిక విప్లవం, పంచాయతీ రాజ్ వ్యవస్థ, యువతకు అవకాశాలు కల్పించడంలో చూపిన దృక్పథం నేటికీ ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.రాజీవ్ గాంధీ దేశంలో సమగ్రాభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, యువత శక్తీకరణకు ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయమై ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన చూపిన దారిలో నడుస్తూ ప్రజల సేవలో ముందంజలో ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ ,మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

Next Story