- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్న కాళేశ్వరం చిన్నచూపు!
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ

దిశ భూపాలపల్లి ప్రతినిధి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాంతంలో 45వేల ఎకరాలకు నీరు అందించడానికి ప్రారంభించిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నేడు చిన్నబోయింది. భూపాలపల్లి జిల్లాలోని గోదావరి నదిపై 4.5 టీఎంసీల నీటిని 13 చెరువుల పునరుద్ధరణ ద్వారా మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, మల్హర్ మండలాల్లోని 63గ్రామాలకు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. రెండు దశాబ్దాలు పూర్తయినప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో పలువురు ప్రశ్నిస్తున్నారు. 0.3 టీఎంసీలు తాగునీరు అందించడానికి ప్రతిపాదించారు. రూ.571.57 కోట్లతో పనులు ప్రారంభించగా నేటికీ సగం పనులు కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టులో భాగంగా 3625 ఎకరాల భూమి సేకరించి పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం 731ఎకరాలు మాత్రమే సేకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు వచ్చినప్పటికీ అధికారులు అలసత్వం వీడడం లేదు. 2012 అటవీ శాఖ సాంకేతిక అనుమతి పొందిన మెగా కంపెనీ 13ఏళ్లుగా పనులు పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు రూ.2081.08కోట్ల విలువగల పనులు మాత్రమే పూర్తి చేశారు. మహాదేవపూర్ మండలంలోని మదిర చెరువు ఎర్ర చెరువు పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఈ చెరువులలోకి జూన్ లోనే కాల్వల ద్వారా నీరు పంపిస్తామని చెప్పిన మెగా కంపెనీ నేటికీ పనులు పూర్తిచేయలేదు. గారేపల్లిలో నిర్మిస్తున్న కొత్తచెరువు నిర్మాణం 25శాతం కూడా పూర్తి కాలేదు. గోదావరి నది నుంచి గారేపల్లి కొత్తచెరువు వద్ద పంపు హౌజ్పనులు పూర్తయి మోటార్లను బిగించినప్పటికీ పని చేయకుండానే ఉన్నాయి. గారేపల్లి కొత్తచెరువు వరకే పైపులైన్వేసి మిగతా చెరువులకు పైపుల నిర్మాణం పూర్తి కాలేదు. కొందరు భూ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో పైప్ లైన్ నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాటారం మండలంలోని పోతులవాయి శివారులో పైప్ లైన్ కు ప్రతిపాదించిన భూముల్లో కట్టడాలు ఉన్నాయి. దీంతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులు దశాబ్దాలు సాగుతున్నాయి.
ప్రతీనెల సమీక్షలు.. పురోగతి నిల్..
ప్రతీనెల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యల ఐడీఓసీ కార్యాలయంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. పనుల్లో వేగంపెంచాలని, భూ సేకరణ పూర్తి చేయాలని ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులు, మేఘా కంపెనీ సిబ్బందికి కలెక్టర్ఆదేశాలు జారీ చేసినప్పటికీ బేఖాతర్ చేస్తున్నారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కు సీరియస్ గా ఆదేశాలు ఇచ్చినప్పటికీ అమలు కావడం లేదు. కేవలం సమీక్షలు తప్ప పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ప్రాజెక్టు పూర్తయితే ఏటా రెండు పంటలు పండించుకోవచ్చన్న రైతుల ఆశకు గండిపడింది. మెగా కంపెనీ జీఎంగా వైవీ రావు కొనసాగుతుండడంతో పనులు త్వరగా జరగడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంథని ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పనులు త్వరగా పూర్తిచేయడంలో సహకరించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రాజెక్టు పూర్తయితే ఎంతో మందికి ఉపాధి..
ప్రాజెక్టు పూర్తయితే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కూలీలతో పాటు ట్రాక్టర్లు యజమానులకు, రైస్ మిల్లులకు, హమాలీలకు వ్యాపారులకు ఎంతోమందికి ఉపాధి ఎక్కువగా దొరుకుతుంది. మహదేవ్పూర్ మండలంలో 10077 ఎకరాలు, కాటారం మండలంలో 26,815 ఎకరాలు, మహా ముత్తారం మండలం 6762 ఎకరాలు, మల్హర్ మండలంలో ఒకవే 626 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది.దీంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది.
పనులు అడ్డుకుంటున్న భూ యజమానులు..
భూములు కోల్పోతున్న నిర్వాసితులు పనులకు అడ్డు తగుతున్నారు. గారేపళ్లి కొత్తచెరువు నిర్మాణ సమయంలో, ఆదివారంపేట చెరువునిర్మాణ సమయంలో భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. కాటారం, మహాదేవపూర్, మహా ముత్తారం, మల్హర్ మండలాల పరిధిలో ఇదే పరిస్థితి నెలకొంది. పరిహారం చెల్లించి పనులు చేయాలని డిమాండ్చేస్తున్నారు. రెవెన్యూ, ఇంజినీరింగ్ అధికారులు పరిహారం చెల్లింపులో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.






