- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానుకోటలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

దిశ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శుక్రవారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి సంవత్సరం మార్చ్ 8న జరుపుకునే ఈ మహిళా దినోత్సవాన్ని అందరం కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకొని ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు శైలజ తెలిపారు. ఈ సందర్భంగా మా శెట్టి శైలజ, సాధుల సరిత, కైరం కొండ లలిత, శ్రీదేవి, సునీత, విజయలక్ష్మి లు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషదాయకమని తెలిపారు. ప్రపంచంలో ఒకరోజు మాకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు కూడా మహిళలపై అనేక ఆకాంక్షల విధించకుండా స్వేచ్ఛగా వివిధ పనులను చేస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద సంస్థలు వివిధ విద్యాసంస్థలు అందరు కలిసి ఈ దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు.






