- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఓటర్లే కీలకం
ఉమ్మడి జిల్లాలో ప్రకటించిన ఓటరు జాబితాలో పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆరు జిల్లాలో వారే అధికంగా ఉన్నారు

దిశ, వరంగల్ బ్యూరో: గ్రామ పంచాయతీ ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేసిన అధికారులు ఓటరు జాబితా, పోలింగ్ ఏర్పాటు పై నజర్ పెట్టారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఓటరు తుది జాబితా వార్డులు, పోలింగ్ కేంద్రాలను గత నెలలోనే ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ రాగానే నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఓటర్లలో పురుషులకంటే మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గెలుపు ఓటములను వారే గ్రామాల్లో ప్రభావితం చేయనున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 75 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1708 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీల్లో 15024 వార్డులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అంతే మొత్తంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 22లక్షల 44వేల 97 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 10లక్షల 99వేల 187 మంది ఉండగా, స్త్రీ ఓటర్లు 11లక్షల 44వేల 801 మంది ఉన్నారు. వీరితో పాటు 83 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
హన్మకొండ జిల్లాలో..
హన్మకొండ జిల్లా పరిధిలో 12 మండలాలు, 210 గ్రామ పంచాయతీలు, 1986 పోలింగ్ కేంద్రాలతో పాటు వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 3లక్షల 70వేల 867 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు లక్షా 80వేల 664 ఉండగా, స్త్రీ ఓటర్లు లక్షా 90వేల 190 మంది ఉన్నారు. ఇతరులు నలుగురు ఉన్నారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లా పరిధిలో 11 మండలాలు, 317 గ్రామ పంచాయతీలు, 2754 పోలింగ్ కేంద్రాలతో పాటు వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 3లక్షల 83వేల 738 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు లక్షా 88వేల 139 ఉండగా, స్త్రీ ఓటర్లు లక్షా 95వేల 589 మంది ఉన్నారు. ఇతరులు 10 మంది ఉన్నారు.
భూపాలపల్లి జిల్లాలో..
భూపాలపల్లి జిల్లా పరిధిలో 12 మండలాలు, 248 గ్రామ పంచాయతీలు, 2104 పోలింగ్ కేంద్రాలతో పాటు వార్డులు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తం 3లక్షల 2వేల 147 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు లక్షా 47వేల 388 ఉండగా, స్త్రీ ఓటర్లు లక్షా 54వేల 744 మంది ఉన్నారు. ఇతరులు 15 మంది ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లా పరిధిలో 18 మండలాలు, 482 గ్రామ పంచాయతీలు, 4110 పోలింగ్ కేంద్రాలతో పాటు వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 5లక్షల 56వేల 780 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 2లక్షల 73వేల 692 ఉండగా, స్త్రీ ఓటర్లు 2లక్షల 83వేల 64 మంది ఉన్నారు. ఇతరులు 24 మంది ఉన్నారు.
ములుగు జిల్లాలో..
ములుగు జిల్లా పరిధిలో 10 మండలాలు, 171 గ్రామ పంచాయతీలు, 1520 పోలింగ్ కేంద్రాలతో పాటు వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 2లక్షల 29వేల 159 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు లక్షా 10వేల 838 ఉండగా, స్త్రీ ఓటర్లు లక్షా 18వేల 299 మంది ఉన్నారు. ఇతరులు 22 మంది ఉన్నారు.
జనగామ జిల్లాలో..
జనగామ జిల్లా పరిధిలో 12 మండలాలు, 280 గ్రామ పంచాయతీలు, 2534 పోలింగ్ కేంద్రాలతో పాటు వార్డులు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 4లక్షల 1406 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు లక్షా 98వేల 466 ఉండగా, స్త్రీ ఓటర్లు 2లక్షల 2906 మంది ఉన్నారు. ఇతరులు 8 మంది ఉన్నారు.
మహిళా ఓటర్లే ఎక్కువ..
ఉమ్మడి జిల్లాలో ప్రకటించిన ఓటరు జాబితాలో పురుషుల కంటే మహిళ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ఆరు జిల్లాలో వారే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే స్త్రీలు 45వేల 614 మంది ఎక్కువగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు, గ్రామ పంచాయతీల పరిధిలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థితిలో వారు ఉన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను బట్టి వారి మద్దతే కీలకం కానుంది. వార్డు, సర్పంచి ఎన్నికల్లో వారు మద్దతు ఇచ్చిన వారే గెలిచే అవకాశం ఉంది.






