- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదన్నపేట చెరువులో మహిళ మృతదేహం లభ్యం
నర్సంపేట పట్టణ శివారులోని మాదన్నపేట చెరువులో ఒక మహిళ శవం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా, నర్సంపేట మండలంలోని బాంజీపేట శివారు నర్సినాయక్ తండాకు చెందిన మహిళగా గుర్తించినట్లు తెలిపారు.

మాదన్నపేట చెరువులో మహిళ మృతదేహం..!
మృతురాలు బాంజీపేట శివారు నర్సినాయక్ తండాకు చెందిన మహిళగా గుర్తింపు?
అనుమానాస్పద మృతిగా పోలీసుల కేసు నమోదు
దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణ శివారులోని మాదన్నపేట చెరువులో ఒక మహిళ శవం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా, నర్సంపేట మండలంలోని బాంజీపేట శివారు నర్సినాయక్ తండాకు చెందిన మహిళగా గుర్తించినట్లు తెలిపారు. సదరు మహిళ గురువారం ఇంట్లో నుండి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలోని గంటను గుర్తు తెలియని దుండగులు దొంగలించినట్లు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఉదయం సోషల్ మీడియా గ్రూపుల్లో పెట్టారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లిన పూజారి గంట మాయమైన విషయాన్ని గమనించి ఆలయ కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే ఆలయ కమిటీకి తెలియజేయాలని కోరుతూ పోస్టులు పెట్టారు. ఐతే ఇదే ఆలయం పక్కన గల చెరువులో ఘటన చోటు చేసుకుంది. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు చెరువులో పడిందా అనేది తెలియాల్సి ఉంది. మహిళ మృతి పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం బయటికి రానున్నాయి.






