- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ షాక్‌తో వివాహిత మృతి.. కుటుంబ సభ్యుల ఆవేదన
తొర్రూరు మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూలీగా పని చేస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.

దిశ, పాలకుర్తి : తొర్రూరు మండల కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కూలీగా పని చేస్తున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసుల వివరాల ప్రకారం, పత్తేపురం గ్రామానికి చెందిన ఓరుగంటి శైలజ (35) మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో పని చేస్తోంది. బట్టలు ఉతికి, ఆరబెట్టేందుకు ఇనుప తీగపై వేస్తుండగా, దానికి విద్యుత్ సరఫరా వైర్ తగిలి ఉండటంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురైంది. ఘటనాస్థలంలోనే శైలజ ప్రాణాలు కోల్పోయింది.
ఈ సంఘటనతో శైలజ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భర్త వీరేశ్‌తో పాటు ఇద్దరు చిన్నపిల్లలున్నారు. భార్య మృతదేహాన్ని చూసిన బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదానికి కారణమైన ఇంటి యజమానిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ, కుటుంబ సభ్యులు శవంతో ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. భర్త వీరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలు తెలుసుకుంటున్నట్లు ఎస్సై రాంజీ నాయక్ తెలిపారు.






