పాడుబడిన బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం..

by Bhanu |   (  Updated:2025-07-19 05:36:36  IST  )

నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది.

పాడుబడిన బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం..
X

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని వల్లభ్‌నగర్ ప్రాంతంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. వరమ్మతోట సమీపంలోని పాడుబడిన బావిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించింది. శనివారం ఉదయం స్థానికులు మిల్లు సమీపంలోని పాడుబడిన బావిలో శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.

మృతురాలి వయసు సుమారు 50 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుందా లేక ఇది మరేదైనా కారణంతో జరిగిందా అన్నది ఇంకా స్పష్టత కావాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Next Story