- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబోయ్ వాసన.. ఆ మార్గంలో వెళ్ళాలంటే నరకయాతన
నర్సంపేట పట్టణం నుండి పాకాల వెళ్ళే వైపుగా గల మెడికల్ కాలేజీ దగ్గరలో డంపింగ్ యార్డు అత్యంత దుర్గంధం వెదజల్లుతోంది.

దిశ, నర్సంపేట : నర్సంపేట పట్టణం నుండి పాకాల వెళ్ళే వైపుగా గల మెడికల్ కాలేజీ దగ్గరలో డంపింగ్ యార్డు అత్యంత దుర్గంధం వెదజల్లుతోంది. క్రమక్రమంగా పెరుగుతున్న చెత్త, వ్యర్ధాలు రోడ్డుపైకి వస్తుండటంతో ప్రయాణీకులకు ఇబ్బందిగా మారుతోంది. నర్సంపేట పట్టణం నుండి కొత్తగూడ వెళ్ళే వైపుగా రోడ్డు పక్కనే చెత్తను వేస్తున్నారు. ఇది క్రమక్రమంగా పెరిగి రోడ్డును కబ్జా చేస్తోంది. ఫలితంగా నిత్యం ప్రయాణించే వేలాది మంది ప్రయాణీకులు, అశోక్ నగర్ గ్రామస్తులు దుర్గంధం బారిన పడుతున్నారు. దామెర చెరువు దగ్గరకు సమీపించామంటే చాలు ముక్కు మూసుకుని నిముషాల పాటు వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాలని నర్సంపేట పట్టణ కమిషనర్ కి పలుమార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై పలుమార్లు వివరణ కోరేందుకు ప్రయత్నం చేసినా కమిషనర్ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.






