- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు సంగ్రామ సభతో కాంగ్రెస్ లో వణుకు పుట్టింది : ఎమ్మెల్సీ రవీందర్ రావు
వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు.

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి : వరంగల్‌లో నిర్వహించిన రైతు సంగ్రామ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన రైతు సంగ్రామ సభకు ప్రజలు భారీగా తరలివచ్చారని ప్రస్తుతం వాగులు, వంకల్లో కనిపిస్తున్న నీరు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ఫలితం కాదని, కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు ల వల్లేనని పేర్కొన్నారు.
చెక్‌డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయని, ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న చెక్‌డ్యాంలను పట్టించుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని ఆరోపించారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ ప్రకటిస్తున్న రుణమాఫీ, బోనస్ హామీలు ప్రజలను మభ్యపెట్టేందుకేనని విమర్శించారు.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. మక్కజొన్న రైతులు నెల రోజులుగా మార్కెట్లలో ఇబ్బందులు పడుతున్నారని, తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ నాయకులు కొనుగోలు కేంద్రాలకు రావాలని సవాల్ విసిరారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించిన ఎమ్మెల్సీ, కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.






