- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టుదలతో అందరం కలిసి మహా జాతరను విజయవంతం చేశాం : మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి
జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం మహాజాతర విజయవంతం కావడానికి అందరం పట్టుదలతో పని చేయడం వల్లనే విజయవంతమైనదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : గత నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగిన మేడారం మహా జాతర విజయవంతం కావడానికి అందరం పట్టుదలతో పని చేయడం వల్లే విజయవంతమైందని, మేడారంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయం నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మంత్రి సీతక్క తో కలిసి మేడారంలోని అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పనులను పరిశీలించి మేడారంలోని హరిత హోటల్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి సీతక్క తో పాటు కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి నిత్యం భక్తులు వివిధ ప్రాంతాల నుండి చేరుకుంటున్నారని, సెలవు రోజులలో లక్షలాదిమంది భక్తులు అమ్మవార్ల దర్శన భాగ్యం కోసం చేరుకుంటున్నారని అన్నారు.
మేడారం చేరుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతరం ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఆలయ ప్రాంతంలో చేపట్టిన పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, గుత్తేదారులకు ఎట్టి పరిస్థితుల్లో బిల్లులు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పట్టుదలతో ఈ జాతరను ఎన్నడు లేని విధంగా విజయవంతం చేయాలనే సంకల్పంతో 251 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ప్రధాన ద్వారం తో పాటు గద్దెల ప్రాంతం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేశామని, 3 వందల సంవత్సరాల వరకు చెక్కుచెదరకుండా పనులు చేయడం జరిగిందని వివరించారు. మహా జాతరకు వచ్చిన భక్తులకు త్రాగునీరు ఇబ్బంది ఏర్పడకుండా చర్యలు తీసుకోవడంతో పాటు నివాస స్థలాలు ఏర్పాటు చేసి అధికారులు విజయవంతం చేశారని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించడం చెప్పుకోదగ్గ విషయమని అధికారులను అభినందించారు.
జాతరకు ముందే 95 శాతం వరకు పనులు పూర్తయ్యాయని, మిగతా ఐదు శాతం పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ జాతర విజయవంతంలో అధికారులు చేసిన కృషి ఎన్నటికీ మరువలేమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్ల శక్తిని గ్రహించి ప్రతి పని విషయంలో చోరో చూపారని, ఏకంగా టాబ్లెట్ సమావేశం నిర్వహించి అమ్మవార్ల భక్తి చాటారని అన్నారు. నిత్యం తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని అన్నారు. సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.






