- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం ఇచ్చిన హామీ నెరవేరేనా..?
మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుందోనని సింగరేణి ఉద్యోగసంఘాలు ఎదురుచూస్తున్నారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఏ మేరకు నెరవేరుతుందోనని సింగరేణి ఉద్యోగసంఘాలు ఎదురుచూస్తున్నారు. సింగరేణి ఎన్నికల ప్రచారం కోసం భూపాల్ పల్లి కి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు పేర్లతో ఉన్న సింగరేణి ఉద్యోగుల పేర్లను మార్పు చేస్తామని అందుకు తగు విధమైన చర్యలు తీసుకుంటామని సింగరేణి ఉద్యోగులకుఆయన హామీ ఇచ్చారు. గత 40 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సింగరేణి ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రక్రియ ప్రారంభమైతే బినామీ పేర్లతో ఉన్న ఉద్యోగులందరికీ భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఆశపడుతున్నారు. సింగరేణి యాజమాన్యం సింగరేణిలో కార్మికులను భర్తీ చేసే క్రమంలో భాగంగా 1986 నుంచి 1989 వరకు సింగరేణి లో పనిచేసే కార్మికులను భర్తీ చేసేందుకై ఎంప్లాయిమెంట్ కార్డు ఉన్న వారందరికీ పరుగు పందెం పెట్టి సింగరేణిలో ఉద్యోగం లో తీసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎంప్లాయిమెంట్ కార్డు లేని వాళ్ళు తమకు దగ్గరగా ఉన్న వారి పేరు మీద పరువు పందెంలో పాల్గొని అందులో గెలిచి ఉద్యోగం సాధించారు. అప్పటినుండి ఫోటో మాత్రం ఉద్యోగం చేసే వ్యక్తిగా పేరు మాత్రం వేరే వారి పేరు పై ఉద్యోగం చేయవలసి వస్తుంది.
ఈ ప్రక్రియ గత 40 సంవత్సరాల జరుగుతున్నప్పటికీ ఈ విషయంపై సింగరేణి కార్మిక సంఘాలు ఎన్నో మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ అందులో మాత్రం మార్పు రావడం లేదు. 1980 నుంచి ఉద్యోగం పొందిన వారు వారి వారసులు సైతం అదే పేరుపై ఉద్యోగం చేస్తూ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకరి పేరుపై తమ ఉద్యోగం చేయాల్సి వస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కు విన్నవించినప్పుడు తాము అధికారుల లోకి వస్తే పేరు మార్పు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది నెరవేరలేదు. 2014లో పేరు మార్పు కోసం ప్రభుత్వం ఒక కమిటీ వేసినప్పటికీ అది నామమాత్రంగానే ఉండిపోయింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం తాము అధికారంలోకి వస్తే పేరు మార్పు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది ఇంతవరకు నెరవేరలేదు. సింగరేణి కార్మిక సంఘాల ఎప్పటికప్పుడు యాజమాన్యానికి విన్నవించు కున్నప్పటికీ వారి ఆవేదన పెడచెవిన పెడుతున్నాయి. సింగరేణి సంస్థలో 500 పైగా ఉద్యోగులు బినామీ పేర్లతో ఉద్యోగాలు చేస్తూ పేరు మార్పు ఎప్పుడు జరుగుతుందని ఎదురుచూస్తున్నాట్లు సమాచారం. బినామీ పేర్లతో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తూ చనిపోయిన వారున్నారు వారి వారసులు సైతం ప్రస్తుత ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. విషయం పై ప్రభుత్వాలు మానవత్వం ఆదేశించి పేరు మార్పు వచ్చేసి సింగరేణి కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పేరు మార్పుపై ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలి
భూపాల్ పల్లి బ్రాంచ్ ఏఐటీయూసీ సెక్రటరీ రమేష్ సింగరేణి ఉద్యోగుల పేరు మార్పు విషయంలో ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న కార్మికులకు ప్రభుత్వం చొరవ చూపి కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.






