ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తా..

by Elthuri vijay kumar |

భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండేలా, రవాణా సౌకర్యాలను బలోపేతం చేసేందుకు అంతర్గత రహదారుల పనులు వేగవంతం చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.

ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తా..
X

ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తా..

- మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తా..

- భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

- చిట్యాల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

దిశ,చిట్యాల: భూపాలపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండేలా, రవాణా సౌకర్యాలను బలోపేతం చేసేందుకు అంతర్గత రహదారుల పనులు వేగవంతం చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు.శనివారం చిట్యాల మండలం లోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పర్యటించారు. సుమారు రూ.903 లక్షల వ్యయంతో వివిధ గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా ఒడితల గ్రామంలో ఒడితల నుండి మొరంచవాగు వరకు రూ.50 లక్షలు మరియు ఆర్ అండ్ బీ రోడ్డు ఒడితల నుండి బద్దిపోచమ్మ ఆలయం వరకు రూ.50 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు, జడల్ పేట గ్రామంలో జడల్ పేట నుండి పాసిగడ్డ తండా వరకు రూ.162 లక్షలు రోడ్డు నిర్మాణ పనులు, రామచంద్రాపూర్ గ్రామం నుండి శాంతినగర్ వరకు రూ.30 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు, పంచాయతీ రాజ్ రోడ్డు గుంటూరుపల్లి నుండి చిట్యాల రోడ్డు వరకు రూ.144 లక్షలు రోడ్డు నిర్మాణ పనులు, చింతకుంటరామయ్యపల్లి గ్రామం నుండి శాంతినగర్ వరకు రూ.100 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు, నైన్ పాక గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. నాపాక దేవాలయం నుండి మామిడితోట వరకు రూ.40 లక్షలు, ఎస్సీ కాలనీ నుండి మొరంచ బ్రిడ్జి వరకు రూ.20 లక్షలు, చెంచుకాలనీ నుండి పాశిగడ్డ తండా వరకు రూ.207 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు, నాపాక సర్వతోభద్ర ఆలయంలో ఎమ్మెల్యే మొక్క నాటి నీరు పోశారు. అనంతరం రూ.100 లక్షలతో ఆలయంలో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ,గ్రామీణ రహదారులు బాగుంటేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకోసం ప్రభుత్వ నిధులతో పాటు ఇతర పథకాల ద్వారా కూడా రహదారి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి అన్నది పట్టణాలకు మాత్రమే పరిమితం కాకుండా, పల్లెల్లో కూడా సమానంగా ఉండాలి అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు.

Next Story