- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవి పంది దాడి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
అడవిపంది దాడిచేసి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని చోటు చేసుకుంది.

దిశ, కొత్తగూడ: అడవిపంది దాడిచేసి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని చోటు చేసుకుంది. ఆదివారం ప్రత్యేక సాక్షుల కథనం ప్రకారం కొత్తగూడ నుండి నర్సంపేట వెళ్లే దారిలో గువ్వలబోడు సమీపంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న వ్యక్తి పై , ఆటోలో ప్రయాణిస్తున్న జాటోత్ లక్ష్మి (40) లపై అడవిపంది దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 సహాయంతో నర్సంపేటలోని ఏరియా హాస్పిటల్ కు తరలించారు.ఘటన స్థలంలో అడవి పంది మృతి.
అడవిని కాపాడుదాం.. జంతువులను రక్షిద్దాం: అటవీ శాఖ అధికారి వజహాత్
సమాచారం తెలుసుకున్న కొత్తగూడ మండల అటవీశాఖ అధికారి వజహాత్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి అడవి పందికి పంచనమ నిర్వహించి అనంతరం జంతు దహన నియమాల ప్రకారం జంతువును అక్కడే ఖననం చేశారు.ఈ సందర్బంగా అటవీ శాఖ అధికారి వజహాత్ మాట్లాడుతూ...అడవి జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని అటవీ శాఖ హెచ్చరిస్తున్నది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో అడవి జంతువులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది కనుక అటవీ ప్రాంతాల్లో , వన్యప్రాణుల అభయారణ్యాల గుండా వెళ్లేటప్పుడు వాహన వేగాన్ని తగ్గించి జాగ్రత్త లు తీసుకోవాలని అడవిని కాపాడుదాం – జంతువులను రక్షిద్దాం అంటూ సలహా సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో ఫారెస్ట్ బీట్ అధికారులు అశోక్, వీరు సింగ్,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.






