శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత పట్టింపులెందుకు..?

by Nallavelli.Anjaneyulu |

మృతి చెందిన‌ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత పట్టింపులెందుకని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్ర‌శ్నించారు.

శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత పట్టింపులెందుకు..?
X

దిశ వరంగల్ బ్యూరో/ నర్సంపేట : మృతి చెందిన‌ ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కు నివాళులు అర్పించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత పట్టింపులెందుకని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్ర‌శ్నించారు. నర్షంపేట లో విలేకర్ల‌తో మాట్లాడారు. డెడ్ బాడీతో పోలీసుల రాజకీయాలేంది? అని విమర్శించారు. శంకర్ గౌడ్ డెడ్ బాడీని పోలీసులు తీసుకెళ్లి ఏం చేసుకుంటారు అని ప్రశ్నించారు. శంకర్ గౌడ్ భౌతిక దేహాన్ని నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉంచి నివాళుల‌ర్పించాల‌న్న‌ది వారి కుటుంబ‌ సభ్యుల కోరిక అన్నారు. ఆర్టీసీ తో 22 ఏళ్ల అనుబంధమున్న డిపో వద్ద శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళి అర్పించాలన్నది ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష అని అన్నారు. డిపో వద్దశంకర్ గౌడ్ డెడ్ బాడీని 5 నిమిషాలు ఉంచేలా అనుమతించాలని కోరితే ఇంత గొడవ చేస్తున్నారన్నారు.

శాంతి భద్రతల సమస్యే ఉండదు. 5 నిమిషాలు ఆర్టీసీ డిపో వద్ద ఉంచాలని చెప్పినా పట్టించుకోకపోతే ఎలా? అన్నారు. శంకర్ గౌడ్ ఇంటి ముందు టెంట్ వేసిన వాళ్లను సైతం పోలీసులు బెదిరిస్తున్నారన్నారు. మేము చెప్పినట్లు వినకపోతే బెన్ ఫిట్స్ కూడా ఇవ్వబోమని శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికులు దొంగలా? లంగలా? అని ప్రశ్నించారు. తమ సహచరుడిని కడసారి చూసుకుందామనుకుంటే ఎందుకు అనుమతించడం లేదు అన్నారు. ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా..? లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా నేను చూసుకుంటానని తెలిపారు. ఐదు నిమిషాలపాటు నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద శంకర్ గౌడ్ భౌతిక కాయాన్ని ఉంచండి కోరారు. శంకర్ గౌడ్ కు నివాళి అర్పించిన తరువాత దహన సంస్కారాలు జరిపించందని అన్నారు. శవ రాజకీయాలు చేస్తున్నామంటూ తమపై కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం చేయ‌డం సిగ్గు చేటు అన్నారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్ బాబు భౌతిక కాయం విషయంలో కాంగ్రెస్ నేతలు చేసింది శవ రాజకీయమా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరు పై తీవ్రస్థాయిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అనుమతి ఇవ్వాలని కోరారు.

Next Story