ఇద్దరు కొడుకులను చంపిన తల్లి.. కారణం ఇదే..!

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-26 15:07:50  IST  )

భర్తమీద కోపంతో కన్నబిడ్డలను కర్కషంగా చంపి గుర్తుతెలియని వ్యక్తులు చేసినట్లుగా అందరినీ నమ్మించింది ఓ తల్లి. ఈ దారుణం కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది.

ఇద్దరు కొడుకులను చంపిన తల్లి.. కారణం ఇదే..!
X

ఇద్దరు కొడుకులను చంపిన తల్లి.. కారణం ఇదే..!

- కేసముద్రం మండలం నారాయణపురంలో విషాదం

దిశ, కేసముద్రం: భర్తమీద కోపంతో కన్నబిడ్డలను కర్కషంగా చంపి గుర్తుతెలియని వ్యక్తులు చేసినట్లుగా అందరినీ నమ్మించింది ఓ తల్లి. ఈ దారుణం కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో చోటుచేసుకుంది. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ వారి సిబ్బంది సహకారంతో ఈ హత్యల మిస్టరీని ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం సీఐ మీడియాకు వివరాలు వెల్లడించారు. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష (25) తన భర్త ఉపేందర్ కు అక్రమ సంబంధం ఉందని అనుమానం ఉండేది. తన ముగ్గురు పిల్లలను తన వద్దకు రాకుండా అత్తమామల వద్దనే భర్త ఉపేందర్ ఉంచేవాడని దీంతో తను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుందని తెలిపారు. తను చనిపోతే తన పిల్లలు ముగ్గురు ఆగమవుతారని, ముందుగా వారిని చంపి తర్వాత తను చనిపోదామని అనుకుందని చెప్పారు. పథకం ప్రకారం మూడవ కుమారుడు నిహాల్ (2) ను జనవరిలో నీటి సంపులో పడేసి చంపిందని తెలిపారు. తరువాత పెద్ద కుమారుడైన మనీష్ కుమార్(5) ను బుధవారం నైలాన్ దారంతో మెడకు చుట్టి హత్య చేసిందని చెప్పారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన ఎస్సై మురళీధర్ రాజ్ దర్యాప్తు చేయగా శిరీష హత్య చేసినట్లు గా నేరాన్ని అంగీకరించిందని తెలిపారు. శిరీషను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఈ సందర్భంగా సిఐ సర్వయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ మురళీధర్ రాజ్, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story