బేటి పడావో.. బేటి బచావో అనే నినాదాన్ని గాలికి వదిలేశారు : పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి

by Disha Web Desk 20 |
బేటి పడావో.. బేటి బచావో అనే నినాదాన్ని గాలికి వదిలేశారు : పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి
X

దిశ, కొత్తగూడ : మహిళా క్రీడాకారులకు న్యాయం చేయలేని నరేంద్ర మోడీ పదవిలో ఉండి ఏం లాభం అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్రసహాయ కార్యదర్శి ఇ. శ్రీశైలం ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజధాని నడిబొడ్డులో నెల రోజుల నుండి ప్రపంచ వేదిక పై భారత కీర్తిని పెంచిన రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. బేటిపడావో.. బేటిబచావో అనే నినాదాన్ని మోడీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ పై చర్యతీసుకోవాలని నిరసన తెల్పుతున్నా మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడే పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లకు న్యాయం చేయమని కోరుతూ శాంతియుత నిరసన ర్యాలీ చేస్తుంటే... వేధింపులకు పాల్పడిన వారిని వదిలేసి లైంగిక వేధింపులకు గురైన వారికి మద్దతుగా నిలిచిన క్రీడాకారులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయం అన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. తక్షణమే మహిళా రెజ్లర్ల క్రీడాకారుల పై అత్యాచారానికి పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఫోక్సో చట్టం కింద కేసునమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed