వడ్డేపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం : ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

వడ్డేపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్టు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.

వడ్డేపల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం :  ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : వడ్డేపల్లి ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్టు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 60వ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లిలో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , బల్దియా మేయర్ గుండు సుధారాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పదేళ్లలో వడ్డేపల్లి అభివృద్ధి కోసం ఎలాంటి కృషి జరగలేదని, ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. దవాఖాన, స్మశాన వాటిక, అంతర్గత రహదారులు, సైడ్ డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధిని దశలవారీగా చేపట్టామని పేర్కొన్నారు.అభివృద్ధి కార్యక్రమాలలో రాజకీయ పక్షపాతం ఉండదని, అన్ని డివిజన్‌లలో సమానంగా నిధులు కేటాయిస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలలోనే ప్రతి డివిజన్‌కు సమపాళ్లలో నిధులు కేటాయించి, అభివృద్ధి పనులను వేగవంతం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అభినవ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెరమండ్ల రామకృష్ణ, డివిజన్ నాయకులు నాగరాజు పాల్గొన్నారు.

Next Story