- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
420 హామీల పై నిలదీస్తాం : సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఫెరోజ్ భాయ్
జనగామలో కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించగా.. దీనిపై మండల కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఫెరోజ్ భాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దిశ, బచ్చన్నపేట : జనగామలో కేటీఆర్ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని బీఆర్‌ఎస్ నేతలు ప్రకటించగా.. దీనిపై మండల కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఫెరోజ్ భాయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, సన్న వడ్లకు ఇచ్చే బోనస్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా పథకం ఎగనామం చేశారని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమైందని నిలదీశారు. మహాలక్ష్మి పథకం పేరుతో 2500 మహిళా పెన్షన్ పథకం పెట్టుకున్నారని, తులం బంగారం పథకం అటకెక్కిందని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని స్పష్టం చేశారు. మండల కాంగ్రెస్ నాయకులు కేటీఆర్‌ను విమర్శించే స్థాయిలో లేరని, ముందు తమ పార్టీ హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులకు ఫెరోజ్ భాయ్ హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మండలంలోని అన్ని స్థానాలను బిఆర్ఎస్ జెండా ఎగరవేసి మండల ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు ఫిరోజ్ ధీమా వ్యక్తం చేశారు.






